వైజాగ్‌‌లో సిఫీ టెక్ డేటా సెంటర్‌‌‌‌... పెట్టుబడి రూ.15 వందల కోట్లు

వైజాగ్‌‌లో సిఫీ టెక్  డేటా సెంటర్‌‌‌‌... పెట్టుబడి రూ.15 వందల కోట్లు

విశాఖపట్నం:  ఐటీ కంపెనీ సిఫీ టెక్నాలజీస్‌‌ రూ.1,500 కోట్లతో నిర్మించనున్న  ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్,  ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ (సీఎల్‌‌ఎస్‌‌)కు ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ ఆదివారం శంకుస్థాపన  చేశారు. ఈ డేటా సెంటర్ కెపాసిటీ 50 మెగావాట్లు. యూఎస్ నాస్‌‌డాక్‌‌లో లిస్ట్ అయిన సిఫీ టెక్నాలజీస్‌‌ సంస్థకు  విశాఖలో 3.6 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆంధ్రా గవర్నమెంట్ కేటాయించింది.  

ఈ ప్రాజెక్టు ద్వారా వెయ్యి మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని, అలాగే ఎడ్జ్ లెవెల్‌‌లో ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యం పెరుగుతుందని లోకేష్ వెల్లడించారు. భారత్,  సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా, థాయిలాండ్ వంటి దక్షిణాసియా దేశాల మధ్య డేటా ట్రాన్స్‌‌ఫర్ మెరుగవుతుందని అన్నారు.