సాగర్ డ్యాం దగ్గర హైటెన్షన్ : రెండు వైపుల మోహరించిన పోలీసులు

సాగర్ డ్యాం దగ్గర హైటెన్షన్ : రెండు వైపుల మోహరించిన పోలీసులు

నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర రెండోరోజు ఉద్రిక్తత కొనసాగుతోంది. ముళ్లకంచెల మధ్య సాగర్ డ్యాంపై రెండు తెలుగురాష్ట్రాల పోలీసుల పహారా కంటిన్యూ అవుతోంది.  సాగర్ ప్రాజెక్ట్ పై ఏపీ వైపు, తెలంగాణ వైపు  భారీగా పోలీసులు మోహరించారు.  నిన్న మధ్యాహ్నం దౌర్జన్యంగా కుడి కాల్వకు నీటిని విడుదల చేసుకున్నా ఏపీ అదికారులు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు దగ్గర పరిస్థితులపై అరా తీస్తున్నాయి తెలంగాణ,ఏపీ ప్రభుత్వాలు.  ఏపీ పోలీసుల దాడిలో గాయపడ్డ కానిస్టేబుల్స్,  ధ్వంసం చేసిన సీసీ కెమెరాలు అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు స్మితా సబర్వాల్. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిబంధనలు ఏపీ ప్రభుత్వం పాటించడం లేదని విమర్శలు వస్తున్నాయి. 

ఇప్పటికే సుమారు 4వేల క్యూసెక్కుల నీటిని ఏపీ విడుదల చేసుకుంది. ప్రస్తుతం సాగర్‌లో 522 అడుగుల నీటిమట్టం ఉండగా.. మరో 12 అడుగులకు చేరితే డెడ్‌ స్టోరేజీకి చేరే అవకాశముంది.  నేడు ఇరు రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అంచనా వేసే అవకాశముంది.

2015 ఫిబ్రవరి 13న నాగార్జున సాగర్ పై  ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య  ఇలాంటి గొడవే జరిగింది.  రెండు ప్రభుత్వాలు పంతానికి పోవడంతో నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర  తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. అప్పట్లో తెలంగాణ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఏపీ అధికారులు కుడిగట్టు క్రస్ట్‌‌‌‌గేట్ల స్విచ్‌‌‌‌రూమ్‌‌‌‌ తలుపులు పగలగొట్టారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.