ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ

ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయ్యింది. సచివాలయం మొదటి బ్లాక్‌లోని క్యాబినెట్‌ మీటింగ్ హాల్ లో జరుగుతున్న ఈ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 70 అంశాలు అజెండాగా కేబినెట్ భేటీ అయినట్లు సమాచారం. రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు క్యాబినెట్‌ ఆమోదం తెలపనుంది. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు ప్రతిపాదనలకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సుమారు రూ. లక్షా 45 వేల కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుంది.

అసెంబ్లీ సమావేశాల నిర్వాహణ అంశం సైతం కేబినెట్ లో చర్చకు రానుంది. వాస్తవానికి ఫిబ్రవరి చివరి వారంలో అసెంబ్లీ సెషన్ నిర్వహించాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే మార్చి మొదటి వారంలో వైజాగ్ లో ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ జరుగనుంది. దీం తోఆ సమ్మిట్ ముగిసిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. మార్చి 6వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కేబినెట్ మీటింగ్ అనంతరం దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.