
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10,392 కరోనా కేసులు నమోదు కాగా..కొత్తగా 72 మంది కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,125 కి చేరిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 455531 కి చేరింది.
కాగా కరోనా నుంచి 8,454 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటి వరకు 3,48,330 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,03,076 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు నివేదికలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో వివిధ జిల్లాల వారీగా చిత్తూరు – 1124, అనంతపురం – 810, కడప – 800, కర్నూలు – 697, నెల్లూరు – 942, ప్రకాశం – 800, గుంటూరు – 900, కృష్ణా – 397, తూర్పుగోదావరి – 1199, పశ్చిమ గోదావరి – 885, విశాఖపట్నం – 675, శ్రీకాకుళం – 603, విజయనగరం – 560 కేసులు నమోదయ్యాయి.