చిన్న షాపు.. కరెంట్ బిల్లు కోటి రూపాయలు.. ఊరంతా అమ్మినా సరిపోదేమో..

చిన్న షాపు.. కరెంట్ బిల్లు కోటి రూపాయలు.. ఊరంతా అమ్మినా సరిపోదేమో..

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఓ షాపు యజమానికి కోటి రూపాయలకు పైగా కరెంటు బిల్లు రావడంతో షాక్‌కు గురయ్యాడు. కొత్తూరు పట్టణంలోని చిన్న నగల దుకాణం యజమాని జి. అశోక్‌కు 2023 సెప్టెంబర్‌ 2 నుంచి అక్టోబర్‌ 2 వరకు వినియోగించిన విద్యుత్‌కు రూ.1,01,56,116 బిల్లు వచ్చింది.  పాలకొండ రోడ్డులోని దుర్గా జ్యువెలర్స్ యజమాని ఆ బిల్లును చూసి షాక్ తిన్నారు.  

అయితే తనకు సగటున నెలకు రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు బిల్లు వస్తుందని అశోక్ తెలిపారు. బిల్లుపై విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నించగా పరిశీలించి కొత్త బిల్లు ఇస్తామని ట్రాన్స్‌ ఏఈ లక్ష్మణరావు హామీ ఇచ్చారు. ఏపీలో ఇలాంటి ఘ‌ట‌న‌లు చాలా జ‌రిగాయి. పూరి గుడిసెలో ఉండే వారికి కూడా వేల‌ల్లో క‌రెంట్‌బిల్లులు వ‌చ్చాయి. దీంతో వారంతా అయోమ‌యానికి గురైయ్యారు.