కరోనా టెస్టుల్లో ఏపీ రికార్డ్

కరోనా టెస్టుల్లో ఏపీ రికార్డ్

కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రతిరోజూ చేసే కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం దక్షిణ కొరియా నుంచి రెండు రోజుల క్రితం లక్ష కిట్లను కూడా తెప్పించింది. ఆ కిట్లతో డాక్టర్లు ఒకే రోజులో 5,508 మందికి కోవిడ్ -19 పరీక్షలు నిర్వహించి రికార్డు సృష్టించారు. ప్రతి మిలియన్ జనాభాకు ఎక్కువ టెస్టులు చేస్తున్న రెండో రాష్ట్రంగా ఏపీ రికార్డు నెలకొల్సింది. కరోనావైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పురోగతిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం అమరావతిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

తొందరగా ఫలితాలొచ్చే పరికరాల ద్వారా వేగంగా పరీక్షలను చేస్తున్నామని ఏపీ సీఎం కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. గతంలో పది రోజుల్లో 17,500 పరీక్షలను నిర్వహించామని, కానీ ఇప్పుడు ఈ లేటెస్ట్ కిట్ల ద్వారా వేగంగా పరీక్షలు చేస్తామని ఆయన అన్నారు. వైరస్ విస్తృతంగా ఉన్న కర్నూలు, గుంటూరు, కృష్ణ మరియు నెల్లూరు జిల్లాల్లో మరిన్ని పరీక్షలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి డాక్టర్లు, పోలీసులు, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు, మరియు గ్రామ కార్యదర్శులను ఉపయోగించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా నియంత్రణలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆస్పత్రులలో పరిశుభ్రతను పాటించాలని.. అందుకోసం ప్రతి రెండు, మూడు రోజులకొకసారి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆయన అన్నారు.

For More News..

కరోనా పోయిన తర్వాత పబ్లిక్ షాపింగ్ ఎలా ఉంటుందంటే..

కరోనా మీద కోపంతో నెట్లో ఏం వెతుకుతున్నారో తెలుసా..

కరోనాను జయించిన 102 ఏళ్ల వృద్ధురాలు