ఆండ్రీ రస్సెల్ విధ్వంసం.. ఐపీఎల్లో నయా రికార్డు

ఆండ్రీ రస్సెల్ విధ్వంసం.. ఐపీఎల్లో నయా రికార్డు

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తో మార్చి 23వ తేదీ జరిగిన మ్యాచ్ లో ఆండ్రీ రస్సెల్ విధ్వంసం సృష్టించాడు.   25 బంతుల్లో 64 పరుగులు చేశాడు.  ఇందులో 7 సిక్సులు,  4 ఫోర్లు ఉన్నాయి.  ఈ క్రమంలో  రస్సెల్ ఐపీఎల్ లో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ లో అత్యంత వేగంగా 200 సిక్సర్లు కొట్టిన క్రికెటర్ గా  రస్సెల్ నిలిచాడు.  97 ఇన్నింగ్స్‌లలో  1332 బంతులాడిన  రస్సెల్ 200 సిక్సులు బాదాడు. 

టోర్నమెంట్ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన తొమ్మిదో బ్యాటర్‌గా నిలిచాడు. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 141 ఇన్నింగ్స్‌లలో 357 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా, రోహిత్ శర్మ (257 ), ఎబి డివిలియర్స్ ( 251 ), ఎంఎస్ ధోనీ (239), విరాట్ కోహ్లీ (235), డేవిడ్ వార్నర్ (228), కీరన్ పొలార్డ్ (223), సురేష్ రైనా (203) తరువాతి స్థానాల్లో ఉన్నారు.    హైదరాబాద్‌ తో జరిగిన మ్యాచ్ లో  ఆండ్రీ రస్సెల్ హాఫ్ సెంచరీతో పాటుగా కీలకమైన రెండు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.  

 ఐపీఎల్ లో  ఎక్కువసార్లు ఒక ఇన్నింగ్స్‌లో 5 లేదా 5+ సిక్సర్లు కొట్టిన ప్లేయర్లు వీరే..

 

  • 29 సార్లు- క్రిస్ గేల్
  • 19- ఏబీ డివిలియర్స్
  • 13- కీరన్ పొలార్డ్
  • 12- కేఎల్ రాహుల్
  • 11- షేన్ వాట్సన్, జోస్ బట్లర్
  • 10- రోహిత్, వార్నర్, శాంసన్


ఇక లీగ్‌‌ మ్యాచ్‌‌లో కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌ 4 రన్స్‌‌ స్వల్ప తేడాతో హైదరాబాద్‌‌పై గెలిచింది.  ఆఖరి ఓవర్‌‌లో 13 రన్స్‌‌ కావాల్సిన దశలో తొలి బాల్‌‌ను సిక్స్‌‌గా మలిచిన క్లాసెన్‌‌, షాహబాజ్‌‌ అహ్మద్‌‌ (16) మూడు బాల్స్‌‌ తేడాలో ఔట్‌‌ కావడం, లాస్ట్‌‌ బాల్‌‌కు 5 రన్స్‌‌ చేయలేకపోవడంతో  సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌కు ఓటమి తప్పలేదు.