IPL 2024 final: రస్సెల్ పని భలే ఉందే.. నైట్ పార్టీలో అనన్య పాండేతో స్టెప్పులు

IPL 2024 final: రస్సెల్ పని భలే ఉందే.. నైట్ పార్టీలో అనన్య పాండేతో స్టెప్పులు

ఐపీఎల్ 2024 టైటిల్ గెలిచిన తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆదివారం(మే 26) అర్దరాత్రి గ్రౌండ్ లో ఓ రేంజ్ లో సెలెబ్రేషన్ చేసుకున్న కేకేఆర్.. ఆ తర్వాత మైదానం వెలుపల భారీగా సంబరాలు చేసుకుంటూ కనిపించారు. ఈ పార్టీలో ప్రధాన ఆకర్షణగా కేకేఆర్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ నిలిచాడు. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేతో కలిసి స్టెప్పులేయడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.        

అనన్య పాండేతో కలిసి తనకు ఇష్టమైన పంజాబీ పాట 'లుట్ పుట్ గయా' అనే పాటకు చిందులేస్తూ కనిపించాడు. ఈ పాట షారుఖ్ ఖాన్ 2023 చిత్రం డుంకీ సినిమాలోది. వెస్టిండీస్ ప్లేయర్లకు పార్టీలో డ్యాన్స్ లు వేయడం తెగ సరదా. గేల్, బ్రావో లాంటి ఆటగాళ్లు గతంలో డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ఈ మ్యాచ్ లో 2.3 ఓవర్లు వేసి మూడు వికెట్లు తీసుకున్నాడు. ఈ టోర్నీ అంతటా బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటిన ఈ విండీస్ వీరుడు తమ జట్టు టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. కేకేఆర్ ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్, రమణదీప్ సింగ్ కూడా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. 

ఆదివారం(మే 26) చెపాక్ వేదికగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. ఇప్పటికే రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన షారుఖ్ ఖాన్ జట్టు. మూడో ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది. తొలుత కోల్‌కతా బౌలర్లు విజృంభించడంతో హైదరాబాద్‌ బ్యాటర్లు స్వల్ప స్కోరుకే చేతులెత్తేశారు.18.3 ఓవర్లలో సన్‌రైజర్స్ 113 పరుగులకే ఆలౌట్ అయ్యారు. స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా 10.3 ఓవర్లలోనే చేధించింది.