సాధారణంగా ఒక ఫ్రాంచైజీ తమ జట్టులోని స్టార్ ప్లేయర్ ను తొలగిస్తే.. ఆ ప్లేయర్ జట్టుపై విమర్శలు చేయడం సహజంగా జరుగుతూ ఉంటుంది. వేరే జట్టుకు ఆడి.. రిలీజ్ చేసిన జట్టుపై రివెంజ్ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ మాత్రం తన విధేయత చాటుకున్నాడు. ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన తర్వాత కేకేఆర్ జట్టుకు తప్ప మరో ఫ్రాంఛైజీకి ఆడనని బహిరంగంగానే చెప్పుకొచ్చాడు. శారీరకంగా ఎంతో దృడంగా కనిపించే రస్సెల్ లోపల ఇంత చిన్న పిల్లాడి మసస్తత్వం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 12 ఏళ్లుగా కేకేఆర్ తో ఉన్న జర్నీని కొనసాగిస్తూ కొనసాగిస్తూ సపోర్టింగ్ స్టాఫ్ గా చేరాడు.
ఐపీఎల్ 2026కి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆదివారం (నవంబర్ 30) ఇంస్టాగ్రామ్ ద్వారా రస్సెల్ ఈ విషయాన్ని వెల్లడించి ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. తాను వేరే ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకోనని.. బదులుగా 2026 సీజన్ కోసం కేకేఆర్ సపోర్టింగ్ స్టాఫ్ లో "పవర్ కోచ్"గా చేరుతానని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపాడు. 2026 ఐపీఎల్ మినీ వేలానికి ముందు కేకేఆర్ జట్టు తనను రిలీజ్ చేయడంతో రస్సెల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. రస్సెల్ నిర్ణయంతో క్రికెట్ ఫ్యాన్స్ ఈ విండీస్ ఆల్ రౌండర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తన విధేయత పట్ల షాకవుతున్నారు.
ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ రస్సెల్ ను ఈ సారి ఆ జట్టు ఫ్రాంజైజీలు రిటైన్ చేసుకోవడానికి ఆసక్తి చూపించలేదు. దశాబ్ద కాలంగా కేకేఆర్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన విండీస్ ఆల్ రౌండర్ ను ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ కు ముందు రిలీజ్ చేసి ఊహించని షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రస్సెల్.. గత సీజన్ లో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో కేకేఆర్ రస్సెల్ ను వదులుకునేందుకు సిద్ధమైంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆండ్రీ రస్సెల్ 109 మ్యాచ్‌లు ఆడి 2593 పరుగులు చేశాడు. కేకేఆర్ తరపున బౌలింగ్ లోనూ రాణించి 122 వికెట్లు పడగొట్టాడు. రస్సెల్ జట్టులో ఉన్నప్పుడు కేకేఆర్ రెండు టైటిల్స్ కూడా గెలుచుకుంది. రస్సెల్ 2014 నుండి కేకేఆర్ జట్టు తరపున ఆడుతున్నాడు. 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ ముందు రస్సెల్ ను కేకేఆర్ రూ.12 కోట్లకు రిటైన్ చేసుకుంది. 2025 ఐపీఎల్ సీజన్ లో ఈ విండీస్ ఆల్ రౌండర్ 167 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు పడగొట్టాడు. వయసు ఎక్కువగా ఉండడంతో పాటు ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం రస్సెల్ కు మైనస్ గా మారింది.
కేకేఆర్ తో ప్రయాణం అద్భుతం: రస్సెల్
రస్సెల్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో ఇలా ఉంది. "ఐపీఎల్‌లో నాకు కొన్ని అద్భుతమైన ప్రయాణం.. గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి. సిక్సర్లు కొట్టడం, మ్యాచ్ లు గెలిపించడం, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ ట్రోఫీ గెలవడం వంటిని చాలా మధురమైన జ్ఞాపకాలు. నేను ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇదే అత్యుత్తమ నిర్ణయం అని నాకు అనిపించింది. నేను వేరే జట్టుకు వెళ్లాలని అనుకోవడం లేదు. ఫ్యాన్స్ నాలో కొంత ఆట మిగిలి ఉందని.. నన్ను కొని సీజన్ ల పాటు ఆడమని కోరారు. అయితే ఇదే నా రిటైర్మెంట్ కు సరైన సమయం అనిపించింది". అని రస్సెల్ చెప్పుకొచ్చాడు.
