- ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అంగన్‌వాడీ కేంద్రాలకు బుధవారం నుంచి ఒంటిపూట పనివేళలు అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి అనితా రామచంద్రన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
దీని ప్రకారం..ఏప్రిల్ నెలంతా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే అంగన్‌వాడీ కేంద్రాలు పని చేయనున్నాయి. అలాగే, మే 1 నుంచి 31 వరకు విద్యార్థులకు, సిబ్బందికి ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది.
