
కౌడిపల్లి, వెలుగు: మండలంలోని మాన్సింగ్ తండాలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో 15 మంది విద్యార్థులు, ఇద్దరు గర్భిణులు, ముగ్గురు బాలింతలు నమోదై ఉన్నారు. తండాలో అంగన్ వాడీ కేంద్రం అద్దె భవనంలో కొనసాగుతోంది. అది శిథిలావస్థకు చేరడంతో టీచర్ మంజుల రూ.2 లక్షలు వెచ్చించి అంగన్ వాడీ సెంటర్ కోసం రేకుల షెడ్డు నిర్మించింది. బిల్డింగ్ లేక సెంటర్ మూత పడితే విద్యార్థులకు, గర్భిణులకు, బాలింతలకు ఇబ్బంది కలుగుతుందని సొంత నిధులతో రూమ్ నిర్మించానని టీచర్ మంజుల తెలిపింది.