Angelo Mathews: లంక దిగ్గజానికి గోల్డెన్ ఛాన్స్: చివరి టెస్టులో కోహ్లీ, సచిన్ రికార్డ్స్‌పై కన్నేసిన మాథ్యూస్

Angelo Mathews: లంక దిగ్గజానికి గోల్డెన్ ఛాన్స్: చివరి టెస్టులో కోహ్లీ, సచిన్ రికార్డ్స్‌పై కన్నేసిన మాథ్యూస్

శ్రీలంక ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ తన కెరీర్ లో చివరి టెస్ట్ ఆడుతున్నాడు. మంగళవారం (జూన్ 17) గాలే వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభమైంది. ఈ టెస్ట్ మాథ్యూస్ టెస్ట్ కెరీర్ లో చివరిది. 16 ఏళ్ళ పాటు లంక టెస్ట్ జట్టులో కీలక ప్లేయర్  గా కొనసాగాడు. కెరీర్ ప్రారంభంలో లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసిన ఈ లంక ఆల్ రౌండర్.. ఆ తర్వాత నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ జట్టు స్టార్ బ్యాటర్లలో ఒకడిగా ఎదిగాడు. తన చివరి టెస్టులో ఈ లంక బ్యాటర్ టీమిండియా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, సచిన్ రికార్డ్స్ బ్రేక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

ALSO READ | Women's ODI Rankings: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌.. నెంబర్.1 స్థానంలో స్మృతి మంధాన

స్వదేశంలో మాథ్యూస్ టెస్టుల్లో 4,323 పరుగులు చేశాడు. ఈ లంక ఆల్ రౌండర్ మరో 14 పరుగులు చేస్తే ఈ జాబితాలో విరాట్ కోహ్లీని  (4,336) అధిగమిస్తాడు. ఇక ఇదే మ్యాచ్ లో మరో 34 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ జియోఫ్ బాయ్‌కాట్ ను సైతం వెనక్కి నెడతాడు. బంగ్లాదేశ్‌పై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితా విషయానికొస్తే, మాథ్యూస్ 720 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. బంగ్లా జట్టుపై ఓవరాల్ గా 820 పరుగులతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టాప్ లో ఉన్నాడు. మాథ్యూస్ తన చివరి టెస్టులో బంగ్లాపై రెండు ఇన్నింగ్స్ ల్లో 101 పరుగులు చేస్తే సచిన్ ను అధిగమించి అగ్రస్థానానికి చేరతాడు. 

గాయాల కారణంగా పూర్తిస్థాయిలో తన ప్రభావం చూపించకపోయినా మాథ్యూస్ వందకు పైగా టెస్టులు ఆడాడు. మొత్తంగా 118 టెస్టుల్లో 44.62 సగటుతో 8,167 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టు క్రికెట్‌లో శ్రీలంక తరపున కుమార్ సంగక్కర, మహేలా జయవర్ధనే తర్వాత అత్యధిక రన్స్ చేసిన మూడో ప్లేయర్ మాథ్యూస్. అలాగే, 2013 నుంచి 2017 వరకు మూడు ఫార్మాట్లలో శ్రీలంకకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 34 మ్యాచ్ ల్లో శ్రీలంక జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. చివరిసారిగా లంక తరపున 2024 టీ20 వరల్డ్ కప్ ఆడాడు.