
ఓవైపు సోలో హీరోగా నటిస్తూనే.. మరోవైపు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు రాజశేఖర్. ఆమధ్య నితిన్ హీరోగా వచ్చిన ‘ఎక్స్‌ట్రా.. ఆర్డినరీ మ్యాన్’ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. తాజాగా శర్వానంద్ సినిమాలోనూ ఆయన నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా ‘లూజర్’ వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. మాళవిక నాయర్ హీరోయిన్. ఇందులో రాజశేఖర్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. రీసెంట్‌గా ఆయన షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. ఇదొక స్పోర్ట్స్ డ్రామా. శర్వా బైక్ రేసర్‌గా నటిస్తున్నాడు.
మడ్ బైక్ రేసుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథకు ఎంతో కీలకమైన పాత్రను రాజశేఖర్ పోషిస్తున్నారని, ఆయన కెరీర్‌లో ఇది బెస్ట్ క్యారెక్టర్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ నిర్మించే యాక్షన్ మూవీలో ఆయన హీరోగా నటించబోతున్నట్టు తెలుస్తోంది. నిఖిల్‌తో ‘స్పై’ తీసిన ఎడిటర్ గ్యారీ బీహెచ్ దీన్ని డైరెక్ట్ చేయబోతున్నాడట. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని సమాచారం.