
హైదరాబాద్, వెలుగు: ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ) అనిల్ అంబానీకి చెందిన ముంబై మెట్రో వన్ ప్రాజెక్ట్ లిమిటెడ్ (ఎంఎంఓపీఎల్)కు అవార్డు మొత్తంలో 50శాతం అయిన రూ. 560.21 కోట్లను జమ చేసింది. ఎంఎంఓపీఎల్ ముంబైలో మెట్రో రైల్ సేవలను నిర్వహిస్తోంది.
ముంబైలో మెట్రో ప్రాజెక్టులపై రెండు సంస్థల మధ్య దీర్ఘకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ప్రాజెక్ట్ వ్యయం రూ. 2,356 కోట్ల నుంచి రూ. 4,321 కోట్లకు పెరిగిందని ఎంఎంఓపీఎల్ పేర్కొనగా, ఎంఎంఆర్డీఏ దీనిని వ్యతిరేకించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎంఎంఆర్డీయే అవార్డు మొత్తంలో 50శాతం చెల్లించింది. ఈ డబ్బును మెట్రో ఇన్ఫ్రా కోసం వాడతారు.