
ఏపీలో భారీగా ఐఏఎస్ లను బదిలీ చేసింది ప్రభుత్వం. 11 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ విజయానంద్. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించింది. ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఉన్న శ్యామల్ రావును జీఏడీ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అనిల్ కుమార్ సింఘాల్ గతంలోనూ టీటీడీ ఈవోగా పనిచేశారు. టీడీపీ హయాంలో టీటీడీ ఈవోగా పనిచేశారు. తర్వాత బదిలీ అయ్యారు. ప్రస్తుత ఈవో శ్యామలరావును చంద్రబాబు నియమించారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజున టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయిన సంగతి తెలిసిదే. దీనిపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సీఎం చంద్రబాబు కూడా అధికారులతో సమావేశం నిర్వహించి టీటీడీ ఈవోపై సీరియస్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే టీటీడీగా ఈవోగా మళ్లీ అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించినట్లు తెలుస్తోంది.
ఎంటీ కృష్ణ బాబును రోడ్స్ ,ట్రాన్స్ ఫోర్ట్ బిల్డింగ్ శాఖలనకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది ప్రభుత్వం. ప్రవీణ్ కుమార్ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చారు. ముకేష్ కుమార్ మీనాను ఎక్సైజ్ శాఖ మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. సౌరభ్ గౌర్ కు మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపాల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు.