మన శంకరవరప్రసాద్ గారు..కొత్త షెడ్యూల్ షురూ

మన శంకరవరప్రసాద్ గారు..కొత్త షెడ్యూల్ షురూ

చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రం  ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేయగా, శుక్రవారం నుంచి  కొత్త షెడ్యూల్‌‌‌‌ను స్టార్ట్ చేశారు. ఈ షెడ్యూల్‌‌‌‌ సెప్టెంబర్ 19 వరకు సాగనుందని, ఇందులో  రెండు చార్ట్ బస్టర్ సాంగ్స్‌‌‌‌ను షూట్ చేయనున్నట్టు సోషల్ మీడియా ద్వారా అప్‌‌‌‌డేట్ ఇచ్చారు మేకర్స్. హైదరాబాద్‌‌‌‌లో వేసిన స్పెషల్ సెట్‌‌‌‌లో ఓ సాంగ్ షూట్ జరగనుందని తెలుస్తోంది.  

చిరంజీవి నటిస్తున్న 157వ సినిమా ఇది. ఇందులో ఆయన వింటేజ్ లుక్‌‌‌‌లో కనిపించనున్నారు. నయనతార హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది.   షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి,  సుష్మిత కొణిదెల  నిర్మిస్తున్న ఈ  చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్‌‌‌‌తో  సినిమాపై అంచనాలు పెరిగాయి.