చిన్న వయసులో సర్పంచ్

చిన్న వయసులో సర్పంచ్

సాధారణంగా 21 ఏళ్ల వయసులో యువతీ యవకులు ఏం చేస్తారు. డిగ్రీ ఫస్ట్ ఇయరో..లేదో ఫైనల్ ఇయరో చదువుతుంటారు. మరికొందరు ఏం చేద్దామని ఆలోచిస్తుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం.. ఊరికి సర్పంచ్ అయిపోయాడు. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.  మధ్యప్రదేశ్లో ఓ యువకుడు.. ఊరికి సర్పంచ్గా ఎన్నికయ్యాడు. దేశంలోనే అతి చిన్న వయసు గల సర్పంచ్గా రికార్డు సృష్టించాడు. 

మధ్యప్రదేశ్​లోని విదిశ జిల్లాకు చెందిన అనిల్ యాదవ్ అనే యువకుడు సర్పంచ్గా ఎన్నియ్యాడు. సరేఖో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ పడిన అతను..12 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థిపై గెలిచి..దేశంలోనే అతిపిన్న వయసు గల సర్పంచ్గా రికార్డు సృష్టించాడు. అనిల్ వయసు 21ఏళ్ల 6 రోజులు మాత్రమే. ఇప్పటి వరకు ఈ రికార్డు రాజస్థాన్  భరత్‌పూర్ జిల్లా డింగ్ పంచాయితీకి చెందిన అస్రుని ఖాన్  అనే వ్యక్తి పేరిట ఉండేది. అతను 21 ఏళ్ల 18 రోజులకే  సర్పంచ్ అయ్యాడు.  

ఎమ్మెల్యే మేనల్లుడిపై గెలుపు..
ప్రస్తుతం పీజీ చదువుతున్న అనిల్ యాదవ్...కరోనా సమయంలో ఊరికి వచ్చినప్పుడు..గ్రామంలో ప్రజలు, స్నేహితులు ఇబ్బందులు పడటం చూసి చలించిపోయాడు. విలేజ్లో సరైన సదుపాయాలు లేక ప్రజలు  అవస్థలు పడటం గమనించాడు. ఆ సమయంలో తన వల్ల అయిన సాయం చేశాడు. ఉన్నతాధికారులతో  మాట్లాడి..గ్రామంలో గోశాల, ఆట స్థలం, స్ట్రీట్ లైట్లు, రోడ్లు వేయించాడు. ఇదే సమయంలో గ్రామంలో పంచాయితీ ఎన్నికలు రావడంతో..గ్రామస్తులు అనిల్ యాదవ్ నే  సర్పంచ్ గా నిలబెట్టారు.  అయితే అనిల్ పై బీజేపీ నేత, ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ మేనల్లుడు వివేక్ శర్మ  పోటీకి దిగాడు. ఎమ్మె్ల్యే రామేశ్వర్ శర్మ ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొన్నారు. కానీ గ్రామస్తులు  అనిల్ యాదవ్ నే  సర్పంచ్‌ను ఎన్నకున్నారు. 

నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..
సర్పంచ్ గా గెలిచిన తర్వాత జిల్లా పాలనాధికారితో పాటు తనకు సహకరించిన అందరికీ అనిల్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని అనిల్ యాదవ్ అన్నారు. గ్రామాన్ని ఆదర్శగ్రామంగా మార్చేందుకు కృషి చేస్తానని చెప్పాడు.