అనిరుధ్‌ జోడీకి టైటిల్‌‌

అనిరుధ్‌ జోడీకి టైటిల్‌‌

న్యూఢిల్లీ: ఇండియా టెన్నిస్‌‌ ప్లేయర్‌‌, హైదరాబాద్ కుర్రాడు అనిరుధ్‌‌ చంద్రశేఖర్‌‌.. రామ్‌‌కుమార్‌‌ రామనాథన్‌‌ కలిసి లెక్సింగ్టన్‌‌ డబుల్స్‌‌ టైటిల్‌‌ సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన మెన్స్‌‌ డబుల్స్‌‌ ఫైనల్లో రెండోసీడ్‌‌ రామ్‌‌కుమార్‌‌–అనిరుధ్‌‌ 6–4, 6–4తో యు సియోయ్‌‌–సుంగ్‌‌ హో హుయాంగ్‌‌ (చైనీస్‌‌తైపీ)పై గెలిచారు. స్టార్టింగ్‌‌ నుంచే అద్భుతంగా ఆడిన ఇండియన్‌‌ ద్వయం కీలక టైమ్‌‌లో ప్రత్యర్థుల సర్వీస్‌‌ను బ్రేక్‌‌ చేసి ఆధిక్యంలో నిలిచింది. 

గంటా 8 నిమిషాల మ్యాచ్‌‌లో రామ్‌‌కుమార్‌‌ జంట 5 ఏస్‌‌లు, 2 డబుల్‌‌ ఫాల్ట్స్‌‌ చేసింది. తమ సర్వీస్‌‌లో 62 శాతం పాయింట్లు రాబట్టింది. వచ్చిన నాలుగు బ్రేక్‌‌ పాయింట్లను కాచుకుంది. మ్యాచ్‌‌ మొత్తంలో ఒక ఏస్‌‌ మాత్రమే కొట్టిన చైనీస్‌‌ తైపీ ద్వయం రెండు డబుల్‌‌ ఫాల్ట్స్‌‌ చేసింది. ఎనిమిది బ్రేక్‌‌ పాయింట్లలో ఆరింటిని సద్వినియోగం చేసుకుంది. విన్నర్లుగా నిలిచిన రామ్‌‌కుమార్‌‌–అనిరుధ్‌‌కు 75 ఏటీపీ పాయింట్లతో పాటు 4980 యూఎస్‌‌ డాలర్ల ప్రైజ్‌‌మనీ లభించింది.