ఉద్దండాపూర్ నిర్వాసితులకు పరిహారం అందింది: x

ఉద్దండాపూర్ నిర్వాసితులకు పరిహారం అందింది: x
  • .సీఎం జడ్చర్లకు రాకముందే ఖాతాల్లోకి డబ్బులు: అనిరుధ్​ రెడ్డి

జడ్చర్ల టౌన్, వెలుగు: జడ్చర్లకు సీఎం రేవంత్​ రెడ్డి రాకముందే ఉద్దండాపూర్ ​నిర్వాసితుల ఖాతాలో పరిహారం పడిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్​రెడ్డి తెలిపారు. గత బీఆర్ఎ స్ సర్కార్ భూనిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్​డబ్బులివ్వకుండా రోడ్డున పడేసిందని విమర్శించారు. శుక్రవారం జడ్చర్లలో సీఎం రేవంత్​రెడ్డికి స్వాగతం పలికిన అనంతరం అనిరుధ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను ఉదండాపూర్​ తప్ప వేరే ఏ విషయం గురించి మాట్లాడటం లేదని కొందరు హేళన చేస్తున్నారని, వారికి ఈ రిజర్వాయర్​ వల్ల కలిగే ఉపయోగాలే తెలియదని చెప్పారు.

రైట్ ​కెనాల్ పూర్తయితే మునుగోడు వరకు, లెప్ట్​ కెనాల్​ద్వారా కొడంగల్ వరకు నీళ్లు వస్తాయని వివరించారు. గత ప్రభుత్వం భూసేకరణ చేసి ఎకరానికి ఆరున్నర లక్షలు ఇస్తామన్నదని, ఆ డబ్బుతో నవాబుపేటలో భూమి కొనడానికి వెళ్తే ఎకరాకు 50 లక్షలకు పెరిగిందన్నారు. రైతులకు ప్లాట్లు ఇస్తున్న ప్రాంతాలకు వారు గతంలో నివసించిన ఊర్ల పేర్లే పెట్టాలని సీఎంను కోరారు.  ప్రతిపక్ష నాయకులు ఏ మోహం పెట్టుకొని పాదయాత్ర చేస్తారని నిలదీశారు. జడ్చర్లలో బైపాస్​కు సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.