టీఆర్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అంజిరెడ్డి

టీఆర్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అంజిరెడ్డి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మారెడ్డి అంజిరెడ్డి ఎన్నికయ్యారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా ఉన్న కావలి అశోక్ కుమార్ ఈనెలాఖరులో ఉద్యోగ విరమణ పొందుతున్నారు. 

ఈ నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి పోస్టుకు కరీంనగర్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎన్నికలు నిర్వహించారు. దీనికి ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి మానేటి ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ... విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.