అంకన్నగూడెంలో 1972 నుంచి ఏకగ్రీవమే..

అంకన్నగూడెంలో 1972 నుంచి ఏకగ్రీవమే..

ములుగు, వెలుగు: ములుగు మండలంలోని ఏజెన్సీ గ్రామమైన అంకన్నగూడెం గ్రామంలో 1972 నుంచి ఏకగ్రీవంగా సర్పంచ్, వార్డు సభ్యులను ఎన్నుకుంటున్నారు. 44 ఏళ్లుగా ఆ గ్రామంలో పెద్దలంతా కలిసి పాలకులను ఎన్నుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 354 మంది ఓటర్లు, ఆరు వార్డులు ఉన్న గ్రామంలో చివరి ఎన్నికలు 2019లో జరగగా అప్పుడు కూడా ఏకగ్రీవంగానే ఎన్నిక జరిగింది. 

ఇక్కడ మొదటి సర్పంచ్​ అల్లెం సమ్మయ్య ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, అల్లెం లచ్చినర్సు మూడుసార్లు, అల్లెం నాగభూషణం, అర్రెం రాణి, ఈక కృష్ణ, చింత శ్యామల ఒక్కోసారి సర్పంచులుగా పని చేశారు. ఈ సారి కూడా ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు సాగుతుండగా, రెండో విడతలో మొదటి రోజు అంకన్నగూడెంలో ఎలాంటి నామినేషన్​ పడలేదు. సమీపంలో ఉన్న రాయినిగూడెం గ్రామం ఏకగ్రీవం కాగా, అంకన్నగూడెంలోనూ ఏక్రగీవం చేసేందుకు గ్రామస్తులు, సీనియర్  సిటిజన్లు పావులు కదుపుతున్నారు.