జీరో జీఎస్టీ ఉద్యమానికి అన్నా హజారే మద్దతు

జీరో జీఎస్టీ ఉద్యమానికి అన్నా హజారే మద్దతు

హైదరాబాద్‌‌, వెలుగు: చేనేత రంగంపై జీరో జీఎస్టీ విధించాలని డిమాండ్‌‌ చేస్తూ తాము చేపడుతున్న దేశవ్యాప్త ఉద్యమానికి సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మద్దతు ప్రకటించారని జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త, అఖిల భారత పద్మశాలి సంఘం, చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న నేత తెలిపారు. తాము చేసిన విజ్ఞప్తికి అన్నా హజారే స్పందించారని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘మీరు తలపెట్టిన ఉద్యమం చాలా ముఖ్యమైంది. భావసారూప్యత ఉన్న వ్యక్తులను ఒకేచోట చేర్చి జీరో జీఎస్టీ ఉద్యమాన్ని చేయాల్సిన అవసరముంది’’అని హజారే పిలుపునిచ్చినట్లు వెల్లడించారు.