
హైదరాబాద్, వెలుగు: మల్లాపూర్‌లోని అన్నపూర్ణ కాలనీ ఇంటి యజమానుల సంఘం నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్షుడిగా పి.నరసింహగౌడ్, ప్రధాన కార్యదర్శిగా బి.సంజయ్ నాయక్ ప్రమాణం చేశారు. కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభు దాస్, కాలనీ సంఘం సలహాదారులు బోనాల శ్రీనివాస్ రావు, కేశవరం ఆంజనేయులు, కాలనీవాసులు వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.