నార్సింగి మున్సిపల్‌‌‌‌ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌గా నాగపూర్ణ బాధ్యతలు

నార్సింగి మున్సిపల్‌‌‌‌ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌గా నాగపూర్ణ బాధ్యతలు

గండిపేట, వెలుగు : నార్సింగి మున్సిపల్‌‌‌‌ చైర్​పర్సన్​గా నాగపూర్ణ, వైస్​చైర్మన్​గా విజయ్​బాబు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. రాజేంద్రనగర్‌‌‌‌ ఆర్డీఓ వెంకట్‌‌‌‌రెడ్డి వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఇటీవల పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్​నెగ్గింది.

ఇక్కడ మొత్తం 18 మంది కౌన్సిలర్లు ఉండగా, 14 మంది బీఆర్ఎస్​కు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో కొత్త చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌గా నాగపూర్ణను, వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌గా విజయ్‌‌‌‌బాబును ఎన్నకున్నారు. అనంతరం నాగపూర్ణ మాట్లాడుతూ ప్రతివార్డును అభివృద్ధి చేస్తానని చెప్పారు. కౌన్సిలర్లను కలుపుకునిపోతానన్నారు.