జల్దీ పంపుర్రి ఇవి: తెలంగాణ స్లాంగ్ మీకు మస్తోచ్చా.. అయితే, ఈ సిన్మా ఛాన్స్ మీ కోసమే!

జల్దీ పంపుర్రి ఇవి: తెలంగాణ స్లాంగ్ మీకు మస్తోచ్చా.. అయితే, ఈ సిన్మా ఛాన్స్ మీ కోసమే!

‘సినిమా పిచ్చోళ్లు’.. ఈ మాట ఎందుకంటున్నానో తర్వాత మీకే అర్ధమవుతుంది. ‘సినిమా’..ఈ పదం ‘ఆలోచనల వైపు పరిగెత్తిస్తుంది.. ఒంటరిగా చేసి బాధిస్తోంది.. చివరికి నలుగురిలో గుర్తిస్తోంది..’ఇంతటి సత్తా ఉంది సినిమాకు. కానీ, సినిమాలో ఒక్క అవకాశం కోసం ఎంతోమంది ఏళ్ల తరబడి నిరీక్షిస్తూ ఉంటారు. ఒక్క అవకాశం రాకపోదా.. నా కల నెరవేరక పోదా? అని ప్రతిక్షణం మనసులో తలుస్తూనే ఉంటారు. అలాంటి సినిమా కోసం ఎంతోమంది ‘సినిమా పిచ్చోళ్లు’ అనే ట్యాగ్ మోస్తూ వస్తున్నారు. 

ఎందుకంటే.. సినిమా అనేది ఒక పాషన్. అందుకోసం ఎంతోమంది జాబ్స్ ప్రిపేర్ అవ్వకుండా, ఉన్న జాబ్స్ వదిలేసి కూడా సినిమా రంగాన్ని నమ్ముకుని గడిపేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘వీరి వెండితెర ప్రయాణం’వారి ఊపిరి సంతకం అనే బతికేస్తున్నారు. అందుకే మొదట..‘సినిమా పిచ్చోళ్లు’అని మాట్లాడింది. మరి అలాంటి మట్టివాసన మాధుర్యాలకి అరుదైన అవకాశం అందిస్తుంది సినీ నిర్మాణ సంస్థ ‘అన్నపూర్ణ స్టూడియోస్’(Annapurna Studios). 

లేటెస్ట్గా తమ కొత్త సినిమా కోసం నటీనటులు కావాలంటూ అన్నపూర్ణ స్టూడియోస్ కాస్టింగ్ కాల్ ప్రకటించింది. ముఖ్యంగా తెలంగాణ స్లాంగ్లో మాట్లాడేవారికి ఈ అరుదైన అవకాశం అందించనున్నట్లు తెలిపింది. వివరాల్లోకి వెళితే. " ఓ పిల్లా.. ఓ పిల్లగా.. సోషల్ మీడియా అంతా ఇగా నువ్వు చేయవట్టే నడుస్తుందన్నట్టు మస్తు సూస్తున్నవ్ గానీ జరా ఈ ముచ్చట విను.. మేము తీసే కొత్త సినిమాకి నటీనటుల కోసం సూస్తున్నం.. అందుకే మిమ్ములను పిలుస్తున్నం...ఇగ ఇది ఎవరెవరికి అంటారా.. ?

ALSO READ : ట్రెండింగ్లో ‘హరిహర వీరమల్లు’ బాయ్కాట్.. అసలు కారణం ఇదేనా..? కలెక్షన్లపై దెబ్బ పడే ఛాన్స్ ఉందా..?

పురుషులు:

పెద్దోళ్ళు (తాతలు): 55-75 వయస్సు ఉండాలి.
మగ పిల్లలు: (10-12 వయస్సు),
కాలేజీ పిల్లగాళ్ళు (15- 25వయస్సు)
అంకుళ్ళు 40-45 వయస్సు. 

స్త్రీలు:

పెద్దోళ్ళు (అమ్మమ్మలు): 50-70
ఆడపిల్లలు 10-12
కాలేజీ పిల్లలు: 15- 25
అక్కలు 20-25 వయస్సుండాలని తెలిపింది. 

అలాగే, మీ క్లోజ్ ఆఫ్, ఫుల్ లెంగ్త్ & ఇంట్రడక్షన్ వీడియోల్ని casting@annapurnastudios.com ఉన్న మెయిల్కి పంపండని సోషల్ మీడియా ద్వారా కాస్టింగ్ వివరాలు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అన్నపూర్ణ స్టూడియోస్ సైట్ లో ఉన్నాయి. ఆలస్యం ఎందుకు విజిట్ చేసి అవకాశం చేజిక్కుంచుకోండి.