ఓజీలో అర్జున్ దాస్ కీ రోల్

ఓజీలో అర్జున్ దాస్ కీ రోల్

ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి సూపర్  హిట్ చిత్రాల్లో ఇంపార్టెంట్ రోల్ చేసిన కోలీవుడ్ స్టార్ అర్జున్‌‌‌‌ దాస్‌‌‌‌కి తెలుగులోనూ మంచి గుర్తింపు దక్కుతోంది. ఇటీవల ‘బుట్టబొమ్మ’ అనే స్ట్రయిట్ తెలుగు మూవీ చేశాడు. తాజాగా ఇప్పుడొక క్రేజీ ప్రాజెక్టులో జాయిన్ అవుతున్నాడు.  పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్‌‌‌‌లో తెరకెక్కుతోన్న ‘ఓజీ’ చిత్రంలో అర్జున్ దాస్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు శనివారం ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా థర్డ్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌‌‌‌లో జరుగుతోంది. 

పవన్ కళ్యాణ్‌‌‌‌తో సహా మిగిలిన టీమ్ అంతా ఈ షెడ్యూల్‌‌‌‌లో పాల్గొంటున్నారు. అర్జున్ దాస్ కూడా షూటింగ్‌‌‌‌లో జాయిన్ అయ్యాడు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.  తమన్ సంగీతం 
అందిస్తున్నాడు.