
గచ్చిబౌలి ర్యాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసులో నిందితులకు బెయిల్ లభించింది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని సమాచారం అందడంతో.. ఏస్ఓటీ పోలీసులు దాడులు చేసి మంజీర గ్రూప్ డైరెక్టర్ జి. వివేకానంద్ పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలో పరారైన వారిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించిన పోలీసులు... పదిమందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకున్నట్లు వివేకనంద్ పోలీసుల విచారణలో అంగీకరించారు. వివేకానంద్.. మరో వ్యాపారవేత్త అబ్బాస్ దగ్గర డ్రగ్స్ కొన్నట్లు పోలీసులు గుర్తించారు.
ALSO READ :- అలర్ట్.. హైదరాబాద్లో మండిపోనున్న ఎండలు
అయితే, అరెస్టైన రోజే వ్యక్తిగత పూచీకత్తుపై గజ్జెల వివేకానంద్ విడుదలయ్యారు. ఈ కేసులో ఫిబ్రవరి 27వ తేదీ మంగళవారం మరో ఇద్దరికి బెయిల్ వచ్చింది. వివేకానందతో పాటు అరెస్ట్ అయిన నిర్భయ్, కేదార్ లను.. వ్యక్తిగత పూచీకత్తు పై గచ్చిబౌలి పోలీసులు విడుదల చేశారు. మిగతా నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. ప్రస్తుతం ఈ డ్రగ్స్ కేసును విచారిస్తున్నారు పోలీసులు.