
న్యూఢిల్లీ: ఈ నెల 6న జరిగే ఎంపీసీ మీటింగ్‌లో ఆర్‌బీఐ వడ్డీ రేటును మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని ఎస్‌బీఐ రీసెర్చ్ రిపోర్ట్ అంచనా వేస్తోంది. దేశంలో ద్రవ్యోల్బణం దిగిరావడంతో పాటు, గ్లోబల్ అనిశ్చితులు నెలకొనడంతో వృద్ధికి పెద్ద పీట వేయాలని చూస్తోందని తెలిపింది. టారిఫ్ అనిశ్చితి నెలకొన్న టైమ్‌లో వృద్ధి వైపు మొగ్గు చూపుతుందని అంచనా వేసింది.
2026–27లో జీడీపీ, ద్రవ్యోల్బణం మెరుగ్గా ఉంటుందనే అంచనా నేపథ్యంలో ఆగస్టు మీటింగ్‌లో వడ్డీ రేట్లను తగ్గించి “ముందస్తుగా దీపావళి”ని ఆర్‌బీఐ తీసుకొస్తుందని, ఫైనాన్షియల్ సంస్థలు అప్పులివ్వడం పెరుగుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది. కాగా, హిస్టారికల్ డేటా చూస్తే పండుగ సీజన్ ముందు వడ్డీ రేట్లు తగ్గిస్తే బ్యాంకులు అప్పులు ఇవ్వడం భారీగా పెరిగింది. రేట్లను తగ్గించడంలో ఆలస్యమైతే అవకాశాలు కోల్పోతామని సూచించింది.