ఆర్టీసీ నుంచి మరో 63 పెట్రోల్‌‌‌‌ బంక్‌‌‌‌లు

ఆర్టీసీ నుంచి మరో 63 పెట్రోల్‌‌‌‌ బంక్‌‌‌‌లు
  • ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి
  • నెలకు రూ. 10 కోట్ల ఆదాయం అంచనా
  • ఇప్పటికే కార్గో, పార్సిల్‌‌‌‌ సర్వీసులతో మంచి ఇన్‌‌‌‌కమ్​
  • సొంతంగా బస్‌‌‌‌ పాస్‌‌‌‌ కౌంటర్ల నిర్వహణ
  • ఈ మధ్య డ్రైవింగ్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌ కూడా స్టార్ట్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రంగానే ఉండటంతో ఇతర మార్గాలను ఆర్టీసీ అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా మరో 63 పెట్రోల్‌‌‌‌ బంక్‌‌‌‌లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రపోజల్స్ రెడీ చేసింది. ఇప్పటికే కార్గో, పార్సిల్‌‌‌‌ సర్వీసులు నడుస్తున్నాయి. ఈ మధ్య ఆర్టీసీ డ్రైవింగ్‌‌‌‌ స్కూళ్లను ప్రారంభించారు.

ప్రస్తుతం 22 పెట్రోల్‌‌‌‌ బంక్‌‌‌‌లు

ఆర్టీసీలో ప్రస్తుతం 22 పెట్రోల్‌‌‌‌ బంక్‌‌‌‌లు నడుస్తున్నాయి. ఇందులో కరీంనగర్‌‌‌‌ జోన్‌‌‌‌లో ఏడింటిని ఆర్టీసీనే సొంతంగా నిర్వహిస్తోంది. మిగతా చోట్ల ప్రైవేట్‌‌‌‌ ప్రొవైడర్స్‌‌‌‌ నడిపిస్తున్నారు. ఇందులో ఆర్టీసీకి ఒక్క రోజు కమీషన్‌‌‌‌ 40 వేలు ఇస్తున్నారు. దీంతో ఆర్టీసీకి మంచి ఆదాయం వస్తోంది. ఆర్టీసీ ఔట్‌‌‌‌లెట్స్‌‌‌‌ కావడంతో అన్ని విధాలుగా బెటర్ అనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే మరో 63 పెట్రోల్‌‌‌‌ బంక్‌‌‌‌లు ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. త్వరలోనే వీటికి పర్మిషన్లు వచ్చే అవకాశం ఉంది. వీటిని సర్వీసు ప్రొవైడర్లకు ఇవ్వడం ద్వారా నెలకు రూ.10 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కార్గో సర్వీసులు.. డ్రైవింగ్‌‌‌‌ స్కూళ్లు..

నాన్ టికెట్ ఆదాయంలో భాగంగా ఈ మధ్య కార్గో, పార్సిల్‌‌‌‌ సర్వీసులను ఆర్టీసీ ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించింది. వీటికి అనేక వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం ప్రతి రోజుకు 12 లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఏపీకి బస్సులు స్టార్ట్‌‌‌‌ అయితే ఆదాయం మరింత పెరగనుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి దాకా 8.5 లక్షల పార్సిల్స్‌‌‌‌ రవాణా చేసినట్లు చెబుతున్నారు. ఇక డ్రైవింగ్‌‌‌‌ స్కూళ్లను కూడా ఏర్పాటు చేశారు. దీనికి కూడా ఇప్పుడిప్పుడే స్పందన వస్తోంది. మరో వైపు ఆర్టీసీ కమర్షియల్‌‌‌‌ ప్లేసులు, బస్టాండ్లలో స్టాల్స్‌‌‌‌, యాడ్స్‌‌‌‌ నుంచి నెలకు రూ.10 కోట్ల దాకా ఇన్‌‌‌‌కం సమకూరుతోంది. ఉద్యోగులు ఎక్సెస్‌‌‌‌ ఉండటంతో బస్‌‌‌‌ పాస్‌‌‌‌ కౌంటర్లను కూడా ఆర్టీసీనే స్వయంగా ప్రారంభించింది. గతంలో ప్రైవేట్‌‌‌‌ ఏజెన్సీలకు ఇచ్చేవారు.

ఇంకా కోలుకోలె

కరోనాతో కకావికలమైన ఆర్టీసీ ఇంకా కోలుకోలేదు. కరోనా కంటే ముందు సంస్థకు రోజుకు రూ.13 కోట్ల దాకా ఆదాయం వచ్చేది. కరోనాతో నెలల తరబడి బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి. మే నుంచి నడుస్తున్నా.. జనాలు బస్సుల్లో ప్రయాణించడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపించడంలేదు. సాధారణంగా దసరా సమయంలో ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూరుతుంది. కానీ ఈసారి తక్కువ కలెక్షన్‌‌‌‌ వచ్చింది. దసరా కంటే రెండ్రోజుల ముందు 53 శాతం ఓఆర్‌‌‌‌, ముందు రోజు 59 శాతం ఓఆరే రావడంపై అధికారులే ఆశ్చర్యపోతున్నారు. రోజుకు 6 కోట్ల రెవెన్యూ కూడా దాటలేదు. ఇక ఏపీతో ఇంటర్‌‌‌‌ స్టేట్‌‌‌‌ ఒప్పందం ఆలస్యం కావడంతో రోజుకు రెండు కోట్ల దాకా నష్టం వాటిల్లుతోంది.