మరో ఎయిర్ ఇండియా ప్లైట్లోటెక్నికల్ ప్రాబ్లం

మరో ఎయిర్ ఇండియా ప్లైట్లోటెక్నికల్ ప్రాబ్లం

మలప్పురం/ అహ్మదాబాద్: ఎయిర్ ఇండియాకు చెందిన మరో విమానంలో టెక్నికల్ ప్రాబ్లం తలెత్తింది. పైలట్లు సమస్యను గుర్తించి.. 2 గంటల ప్రయాణం తర్వాత టేకాఫ్​అయిన ఎయిర్​పోర్ట్​కు తిరిగివచ్చి సేఫ్ ​ల్యాండింగ్ ​చేశారు. కేరళలోని కాలికట్ ఇంటర్నేషనల్​ఎయిర్​పోర్ట్ ​నుంచి బుధవారం (జులై 23) ఉదయం 9.07 గంటలకు పైలట్లు, సిబ్బంది సహా 188 మందితో ఎయిర్ ఇండియా ఎక్స్‌‌‌‌ప్రెస్ విమానం(IX 375) దోహాకు బయలుదేరింది. 

రెండు గంటల ప్రయాణం తర్వాత విమానం క్యాబిన్ ఏసీలో సాంకేతిక సమస్య తలెత్తిందని పైలట్లు గుర్తించారు. వెంటనే ఫ్లైట్​ను కాలికట్ ఎయిర్​పోర్టుకు మళ్లించారు. కాగా, సాంకేతిక లోపం కారణంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌‌‌‌ప్రెస్ విమానం  టేకాఫ్ అయిన 2 గంటల తర్వాత 11.12 గంటలకు అదే విమానాశ్రయానికి తిరిగి వచ్చిందని 
విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. 

అహ్మదాబాద్​లో ఇండిగో విమానం..

అహ్మదాబాద్ నుంచి డయ్యూకు వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్​లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో టేకాఫ్​ కు కొద్ది నిమిషాల ముందు ఫ్లైట్ ను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.