కూలటానికే కట్టారా ఏంటీ : బీహార్ లో మరో బ్రిడ్జి కూలింది.. 16 రోజుల్లో 10వ వంతెన

 కూలటానికే కట్టారా ఏంటీ : బీహార్ లో మరో బ్రిడ్జి కూలింది.. 16 రోజుల్లో 10వ వంతెన

బ్రిడ్జి కడితే ఎలా ఉండాలో తెలుసా.. నాలుగు తరాల తర్వాత కూడా మాట్లాడుకునే విధంగా ఉండాలి. నిజాం కాలంలో కట్టిన మూసీ వంతెనలను ఇప్పటికీ చెప్పుకుంటాం..  బీహార్ రాష్ట్రంలో ఇప్పుడు అందుకు భిన్నం.. కళ్ల ముందు కట్టినవి.. కళ్ల ముందే కూలిపోతున్నాయి.. ప్రారంభించిన రోజులకే నేల మట్టం అవుతున్నాయి.. వరదలు వస్తే వాష్ ఔట్ అవుతున్నాయి.. ఒకటీ రెండూ అనుకుంటే మాములే.. జస్ట్ 16 రోజులు.. రెండు వారాల్లోనే బీహార్ రాష్ట్రంలో అక్షరాల 10 బ్రిడ్జీలు కొట్టుకుపోయాయి.. కూలిపోయాయి.. వరసగా జరుగుతున్న ఘటనతో.. బీహార్ రాష్ట్రంలోని బ్రిడ్జీల నాణ్యతపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. వివరాల్లోకి వెళితే..

బీహార్‌లో గురువారం  (జూలై 4,2024) మరో వంతెన కూలిపోయింది.కేవలం 15 రోజుల వ్యవధిలో బీహార్ లో పదో సంఘటన ఇది. సరన్ జిల్లాలో గండకి నదిపై బనేయాపూర్ బ్లాక్ లో ఈ బ్రిడ్జి ఉంది. సరన్ లోని అనేక గ్రామాలను కలుపుతూ 15ఏళ్ల క్రితం ఈ బ్రిడ్జిని నిర్మించారు. గడిచిన 24గంటల్లో రెండు వంతెనలు కూలిపోయాయని జిల్లా మేజిస్ట్రేట్ అమన్ చెప్పారు. వంతెన కూలిపోవడానికి కారణాలు ఇంకా తెలిసి రాలేదన్నారు.  ఈ బ్రిడ్జి కూలిన ప్రమాదంలో  ప్రాణనష్టం జరగలేదని అన్నారు.