సృష్టి సంతాన సాఫల్య కేంద్రం పై మరో కేసు న‌మోదు

సృష్టి సంతాన సాఫల్య కేంద్రం పై మరో కేసు న‌మోదు

సరోగసి, ఐవీఎఫ్‌ ద్వారా పిల్లలు లేని దంపతులకు బిడ్డలు అందిస్తామని ప‌సిపిల్ల‌లను అక్ర‌మ ర‌వాణా చేసిన యూనివర్సల్ సృష్టి సంతాన సాఫల్య కేంద్రం పై తాజాగా మరో కేసు న‌మోదైంది. కొత్త‌గూడెం కు చెందిన సులక్షణ రాణి దంపతులు సంతానం కోసం సృష్టి ఆసుప‌త్రి కేపిహెచ్‌బీ కాలనీ బ్రాంచ్ ని సంప్రదించగా.. అక్క‌డ వారు విశాఖపట్నం బ్రాంచ్ లో సరోగసి ద్వారా బిడ్డను ఇస్తామంటూ డబ్బులు వసూలు చేసారని పీఎస్ లో ఫిర్యాదు చేశారు

విడతల వారిగా 13లక్షల రూపాయలను డా.నమ్రత బ్యాంక్ అకౌంట్ కు పంపామ‌ని బాధితులు వాపోయారు.వారు చెప్పిన తేదీల్లో బిడ్డకోసం విశాఖ పట్నం వెళ్ల‌గా.. సరోగసి చికిత్స తీసుకుంటున్న తల్లి కోవిడ్ తో మృతి చెందిన‌ట్టు బుకాయించారని వెల్లడించారు.

#మీడియా లో సృష్టి సంతాన సాఫల్య కేంద్రం నిర్వాహకులు , తిరుమల అరెస్ట్ అయిన వార్త విని ఆందోళనకు గుర‌య్యామ‌ని ఆ దంపతులు కొత్తగూడెం పీఎస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసును కేపిహెచ్‌బీ పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు.