ఫాం హౌస్ కేసులో బంజారాహిల్స్ పీఎస్‭లో రామచంద్రభారతిపై మరో కేసు

ఫాం హౌస్ కేసులో బంజారాహిల్స్ పీఎస్‭లో రామచంద్రభారతిపై మరో కేసు

మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతిపై మరో కేసు నమోదైంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రామచంద్రభారతిపై సిట్ ఆఫీసర్ ఏసీపీ గంగాధర్ ఫిర్యాదు చేశారు. విచారణ సమయంలో ఆయన వద్ద దొరికిన ఐఫోన్, ల్యాప్ టాప్‭లో నకిలీ పాస్ పోర్టులు ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. భరత్ కుమార్ శర్మ పేరుపై ఉన్న పాస్ పోర్టును పోలీసులకు అందించారు. అందులో కర్ణాటకలోని పుత్తూరు అడ్రస్ ఉన్నట్లు గుర్తించారు. 

రామచంద్రభారతి మూడు చొప్పున ఫేక్ ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లను  తయారు చేయించుకొని పెట్టుకున్నాడని అంతకుముందు..  ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే రామచంద్రభారతిపై పలు సెక్షన్ల కింద బంజారాహిల్స్ పీఎస్‭లో కేసులు నమోదయ్యాయి.