
స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసపై అప్పట్లో ఇస్కాన్ సన్యాసి అమోఘ్ లీలా దాస్ చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి వార్తల్లో కెక్కారు. మహిళలపై, వారి శరీర తీరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మరో సారి చిక్కుల్లో పడ్డారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు తీవ్ర స్థాయిలో తిట్టిపోస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. సన్యాసి.. ఒక మహిళ తప్పనిసరిగా జిమ్ వర్కౌట్‌లకు దూరంగా ఉండాలని, వారికి అనువైన ఇంటి పనులను చూడాలని ఆరోపించారు. ఈ క్రమంలోనే అతను జిమ్‌కు వెళ్ళే ఆడవారిని ఎగతాళి చేస్తూ, బాడీ షేమ్ చేస్తూ కామెంట్ చేశారు. "మీరు ఇంటి పనులు చేస్తే ఎప్పుడూ పొట్ట రాదు. ఆడవారికి ఇల్లే నెం.1 జిమ్" అని అమోఘ్ లీలా దాస్ వీడియోలో చెప్పారు.
దీనిపై నెటిజన్లు ఏమంటున్నారంటే..
అమోఘ్ లీలా దాస్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసే ఆలోచనలను తెలియజేస్తున్నాయి. అతని మాటలపై కోపం వెల్లగక్కుతూ పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "అతను మాట్లాడే మాటలకు అర్థం లేదు. మహిళలంటే ద్వేషంతో, అగౌరవంతో ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నాడు" అని ఓ ట్విట్టర్ యూజర్ బదులిచ్చారు. మరికొందరు విషయాన్ని గుర్తించడానికి మొత్తం వీడియోను అడిగారు. మరికొందరు ఆయన భక్తులు, అభిమానులు మాత్రం ఉద్దేశపూర్వకంగా ఈ వీడియోను వైరల్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
These new age Internet clowns have made a mockery of our religion. An organisation like ISKCON founded by Prabhupada Swamy has been hijacked by new age English speaking clowns and are ruining its name everyday.
— Roshan Rai (@RoshanKrRaii) July 12, 2023
What nonsense is this? pic.twitter.com/DtLq6ubZye