కోలీవుడ్‌లో మరో వివాదం.. 'ఫర్హానా'లో కొన్ని సీన్లు తీసేయాలని డిమాండ్

కోలీవుడ్‌లో మరో వివాదం.. 'ఫర్హానా'లో కొన్ని సీన్లు తీసేయాలని డిమాండ్

కోలీవుడ్ లో మరో వివాదం రాజుకుంది. ఇటీవల ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన 'ది కేరళ స్టోరీ' ఎన్నో వివాదాలకు దారి తీసింది. ఆ కాంట్రవర్సీలను మర్చిపోకముందే మరో సినిమాపై రచ్చ మొదలైంది. నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వంలో హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ నటించిన 'ఫర్హానా' సినిమా మే 12న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రిలీజైన ట్రైలర్ పై వివాదం నెలకొంది. ముస్లింల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై కొన్ని ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సినిమాలో ముస్లిం మహిళలను, హిజాబ్‌ను అవమానించేలా డైలాగ్‌లు ఉన్నాయని కొన్ని ఇస్లామిక్ సంస్థలు ఆరోపిస్తున్నాయి. కొన్ని సీన్లు అభ్యంతరం వ్యక్తమయ్యేలా ఉన్నాయని, వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి.

మేకర్స్ స్టేట్మెంట్..

'ఫర్హానా' వివాదంపై నిర్మాతలు, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఒక ప్రకటన విడుదల చేశారు. "ఫర్హానా సినిమా అభిమానులందరికీ చెప్పేదేంటంటే.. ఈ సినిమా ఏ మతం లేదా సెంటిమెంట్‌లకు వ్యతిరేకం కాదు. దయచేసి అర్థం చేసుకోండండన్నారు. తమ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ కైతి వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్‌లను నిర్మించిందని.. ఇప్పుడు అదే తరహాలో మే 12న 'పర్హానా'ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. తాము తీసే చిత్రాల్లో నాణ్యత ఉంటుందని, ఆలోచింపజేసేవిగా ఉంటాయని, సామాజిక బాధ్యత ఉంటాయని నిర్మాతలు స్పష్టం చేశారు.