
కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ మరో అడుగుముందుకేసి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. తియ్యాన మురళీ రాజ్ దర్శకత్వంలో లీడ్ రోల్ చేయనున్నాడు. దిగంగనా సూర్యవంశీ హీరోయిన్. కె.వెంకట రమణ నిర్మాత. సోమవారం రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కి వినాయక్ క్లాప్ కొట్టారు. నాగబాబు కెమెరా స్విచాన్ చేశారు. లగడపాటి శ్రీధర్ గౌరవ దర్శకత్వం వహించారు. ప్రభుదేవా, లారెన్స్ తరహాలో జానీ కూడా నటుడిగా సక్సెస్ అవ్వాలంటూ శ్రీధర్ విషెస్ చెప్పారు. ‘జానీ మాస్టర్ హీరో అవడం హ్యాపీ’ అన్నాడు యాంకర్ ప్రదీప్. జానీ మాట్లాడుతూ ‘నాతోనే ఈ సినిమా చేస్తానని దర్శక నిర్మాతలు పట్టుబట్టడంతో చేస్తున్నాను. షూటింగ్స్ లేనప్పుడు టీవీ షోస్ లో కనిపించడం లాంటిదే ఇది కూడా. కొరియోగ్రఫీకే నా ఫస్ట్ ప్రయారిటీ’ అని చెప్పాడు. డ్యాన్స్ బ్యాక్ డ్రాప్ మూవీ కాదని, లవ్ ఎంటర్ టైనర్ అని దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.
For More News..
కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన బైక్.. యువకుడి మృతి
హీరో రాం చరణ్‌కు కరోనా పాజిటివ్
100 గజాల్లో 5 అంతస్తుల నిర్మాణం.. బిల్డింగ్ పై నుంచి పడి కార్మికుడి మృతి