అనకాపల్లి ఫార్మా సెజ్లో మరో అగ్ని ప్రమాదం

అనకాపల్లి  ఫార్మా సెజ్లో మరో అగ్ని ప్రమాదం

ఏపీలోని అనకాపల్లి జిల్లాలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. పరవాడ జవహార్లాల్ నెహ్రూ వీధుల్లోని ఫార్మా కంపెనీలో ఆగస్టు 22  అర్థరాత్రి కెమికల్స్ కలుపుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో  నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు కాగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు,అధికారులు గాయాలైన వారిని విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ ముగ్గురిని  జార్ఖండ్ కార్మికులుగా గుర్తించారు.

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్ ను  ఆరాతీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందజేయాలని సూచించారు  .  అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ లు వాడాలని  సూచించారు. వెంటనే బాధితులతో మాట్లాడాలని హోంమంత్రి అనితను ఆదేశించారు చంద్రబాబు. దీంతో కాసేపట్లో అనిత  ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. ఇటీవలే అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలి 18 మంది చనిపోయిన సంగతి తెలిసిందే..