పవన్ OG కోసం మరో జీవో.. ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షో.. టికెట్ ధర ఎంతంటే..

పవన్ OG  కోసం మరో జీవో.. ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షో.. టికెట్ ధర ఎంతంటే..

పవన్ కళ్యాణ్ నటించి ఓజీ సినిమా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావాల్సినంత వెసులుబాటు కలిగించేలా నిర్ణయం తీసుకుంది. ప్రీమియర్ షోను మరో రోజు ముందుగానే ప్రదర్శించుకునేలా అనుమతించంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రీమియర్ షోకు అనుమతించి పవన్ ఫ్యాన్స్ కు ఓ రోజు ముందుగానే సినిమా చూసే అవకాశం కల్పించింది.

పవన్ OG  సినిమా కోసం మరో జీవో ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. సెప్టెంబర్ 24న రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షోకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి 25న తెల్లవారుజామున ఒంటిగంటకు ప్రీమియర్ షో ప్రదర్శించాలని నిర్ణయించారు. కానీ ఒక రోజు ముందుగానే.. అంటే 24న రాత్రి 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ లో సినిమా ప్రదర్శించేలా మార్పు చేశారు.

మరో వైపు OG ప్రీమియర్ షో కు టికెట్ రేట్లను భారీగా పెంచుకునే అవకాశం ఇచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధరను వెయ్యి రూపాయలుగా ( రూ.1000) నిర్ణయించింది. 

ఇటు తెలంగాణలో 24 రాత్రి 9 గంటలకు సినిమా ప్రీమియర్ షో స్టార్ట్ అవుతుంది. అంటే ఏపీ కంటే ఒక గంట ముందే తెలంగాణలో సినిమా ప్రదర్శిస్తారు. 

తొలిసారి పవన్ సినిమాకు A సర్టిఫికెట్:

ఓజీ సినిమాకు సెన్సార్ బోర్డు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. పవన్ సినిమాలకు ఎ సర్టిఫికెట్ రావడం ఇదే ఫస్ట్ టైమ్. వయలెన్స్ మోతాదులో ఉండేలా చూసుకునే పవన్..  ఈసారి కాస్త పెంచినట్లుంది. ఇక సినిమా లెంత్154. నిమిషాల15 సెకన్లు (2 గంటల 34 నిమిషాల 15 సెకన్లు). వాస్తవానికి ఈ సినిమా రన్‌టైమ్ 156.10 నిమిషాలు కాగా, సెన్సార్ బోర్డు సూచనల మేరకు కొన్ని సీన్స్ కట్ చేయడంతో లెంత్ తగ్గింది. స్మోకింగ్ సీన్స్‌కు సంబంధించి డిస్‌క్లైమర్, వాయిస్ ఓవర్ ఇవ్వడంతో పాటు కొన్ని హింసాత్మక సన్నివేశాలకు కట్ చెప్పినట్లు సమాచారం. చిత్ర బృందం ఈ మార్పులు చేసి ఫైనల్ వెర్షన్‌ను సిద్ధం చేసింది.

అంచనాలను పెంచిన ట్రైలర్

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'ఓజీ' ట్రైలర్ ఈ రోజు ( సెప్టెంబర్ 22న )  విడుదలైంది. ట్రైలర్‌లో పవన్ కల్యాణ్ స్టైలిష్ లుక్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్, థమన్  సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఓజాస్ గంభీర అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి వంటి తారలు ముఖ్య పాత్రలు పోషించారు. డి.వి.వి. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.