- కొన్ని గంటల వ్యవధిలోనే రెండు మర్డర్స్
ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి. మోనీ చక్రవర్తి(40) అనే కిరాణా దుకాణాదారుడిని దుండగులు పదునైన ఆయుధాలతో దాడిచేసి చంపేశారు. సోమవారం రాత్రి పలాష్ జిల్లాలోని చార్‌సిందూర్ బజార్‌లో ఈ ఘోరం జరిగింది. చక్రవర్తి దుకాణం మూసేసి ఇంటికి వెళ్తుండగా దుండగులు దాడి చేశారు.
రక్తపుమడుగులో పడిఉన్న ఆయనను స్థానికులు ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చక్రవర్తి చాలా మంచి వ్యక్తి అని, ఎన్నో ఏండ్లుగా కిరాణా షాపు నడిపిస్తున్నాడని స్థానికులు చెప్తున్నారు.
జర్నలిస్ట్‌ను కాల్చి చంపేసిన్రు
చక్రవర్తి మర్డర్‌కు కొన్ని గంటల ముందే బంగ్లాదేశ్‌లోని జెస్సోర్ జిల్లాలో మరో హిందూ వ్యాపారి, న్యూస్ పేపర్ ఎడిటర్ అయిన రాణా ప్రతాప్ బైరాగి(38)ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కపాలియా బజార్ నుంచి వెళ్తున్న రాణా ప్రతాప్‌తో కొందరు వ్యక్తులు కారణం లేకుండా గొడవకు దిగారు.
ఈ క్రమంలో దుండగులు కాల్పులు జరిపారు. ప్రతాప్ తలలోకి బులెట్లు దిగడంతో ఆయన స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం దుండగులు ఆయన గొంతు కోసి పరారయ్యారు. ఒక్క డిసెంబర్‌లోనే 11 మంది హిందువులు హత్యకు గురయ్యారు.
