గొల్లపల్లి ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్

గొల్లపల్లి ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలోని మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. దీంతో 10 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత గురైయ్యారు. వెంటనే వారిని సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు. అయితే మన ఊరు–మన బడి కార్యక్రమంలో భాగంగా స్యూల్ లోని మంచి నీటి సంపు రిపేర్ జరుగుతోంది. ఈ క్రమంలో గత మూడు రోజులుగా వాటర్ సరిగా రావడం లేదని స్కూల్ సిబ్బంది తెలిపారు. దీంతో ట్యాంకర్ తో వాటర్ తెప్పించామని చెప్పారు. ఈ వాటర్ తాగడం వల్లనే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగి ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు.

కాగా, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను జిల్లా ప్రధాన అసుపత్రికి తరలించి, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న DMHO మోహన్ రావు, ఆర్డీఓ శ్రీనివాస్ రావు ఆసుపత్రికి చేరుకొని విద్యార్థుల పరిస్థితి గురించి తెలుసుకున్నారు. పిల్లల ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.