తిరుమల మెట్లదారిలో మరో చిరుత : త్వరగా కర్రలివ్వండి సామీ

తిరుమల మెట్లదారిలో మరో చిరుత : త్వరగా కర్రలివ్వండి సామీ

తిరుపతిలోని అలిపిరి  నడక మార్గంలో తాజాగా మరో చిరుత కలకలం రేపింది.  లక్ష్మీనరసింహ స్వామి ఆలయం నామాల గవి వద్ద చిరుత సంచరిస్తున్నట్లుగా ట్రాప్ కెమెరాకు చిక్కింది.  విషయం తెలుసుకున్న టీటీడీ, అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మరో వారంలో అలిపిరి నడకదారి భక్తులకు ఊత కర్ర అందిస్తామని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. చిరుతల జాడ కోసం ఆపరేషన్‌ కొనసాగుతోందని.. వాటిని పట్టుకునేందుకు ఫారెస్ట్‌ అధికారులకు పూర్తిగా సహకరిస్తామని ఆయన తెలిపారు.

ALSO READ:మగాళ్ల కంటే.. మహిళల్లోనే గుండె జబ్బులు ఎక్కువా..! : సర్వేలు చెబుతున్న నిజం ఏంటీ..

 అలిపిరి నడకమార్గంలో చిరుత దాడిలో ఎనిమిదేండ్ల బాలిక చనిపోయిన సంగతి తెలిసిందే. 2023 ఆగస్టు 11  వారం రాత్రి 8 గంటల టైంలో చిన్నారి లక్షిత తన కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన కొండకు వెళ్తున్నారు. ఇదే టైంలో ముందు వెళ్తున్న చిన్నారిపై అడవిలో నుంచి వచ్చిన చిరుత ఒక్కసారిగా దాడి చేసింది. పాప పేరంట్స్ భయంతో గట్టిగా అరవడంతో అడవిలోకి ఈడ్చుకెళ్లింది.  ఇలాంటి సమయంలో మరో చిరుత కనిపించడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నడకదారిలో వెళ్లాలంటే భయంగా ఉందంటూ ఆవేదన చెందుతున్నారు.