‘మత్తు వదలరా’ ఫ్రాంచైజీతో మెప్పించిన సత్య, హితేష్ రానా కాంబినేషన్ మరోసారి అలరించబోతోంది. శుక్రవారం వీరి కాంబోలో తెరకెక్కుతున్న కొత్త చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. హితేష్ రానాకు దర్శకుడిగా ఇది నాలుగో చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చెర్రీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రియా సిన్హా హీరోయిన్‌గా నటిస్తుండగా, వెన్నెల కిశోర్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. ఈ కొలాబరేషన్ మరోసారి ప్రేక్షకులకు నవ్వుల విందు అందించబోతున్నట్టు మేకర్స్ తెలియజేశారు.
