నిఖిల్ సిద్ధార్థ్, డైరెక్టర్ వి ఐ ఆనంద్ కాంబోలో మరో మూవీ?

 నిఖిల్ సిద్ధార్థ్, డైరెక్టర్ వి ఐ ఆనంద్ కాంబోలో మరో మూవీ?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్(Nikhil Siddhartha)  వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. రీసెంట్ గా స్పై మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్..  తాజాగా మరో డైరెక్టర్ తో మూవీ చేయడానికి రెడీ అయ్యాడని తెలుస్తోంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి హర్రర్ మూవీతో హిట్ ఇచ్చిన డైరెక్టర్ వి ఐ ఆనంద్(Vi Anand) తో మరోసారి ఈ కాంబోలో మూవీ రానుందని టాక్ వినిపిస్తోంది.  

హార్రర్, థ్రిల్లర్ జోనర్ లో మూవీస్  తెరకెక్కేంచే ఆనంద్..ఫ్యాన్స్ ను తనదైన శైలిలో ఆకట్టుకుంటారు. త్వరలో వీరి ప్రాజెక్ట్ పై అధికార ప్రకటన వెలువడనుంది.  ఆనంద్ ప్రస్తుతం సందీప్ కిషన్ తో తీస్తున్న ఊరు పేరు భైరవకోన మూవీ కూడా థ్రిల్లర్ నేపథ్యంలో వస్తుండటంతో నిఖిల్ మూవీ స్టోరీపై కూడా ఆసక్తి కలిగిస్తోంది. 

ALSOREAD :నన్ను బాడీ షేమింగ్ చేశారు.. అయినా కూడా!

కార్తికేయ 2 మూవీ తో నిఖిల్ గ్రాఫ్ అమాంతం మారిపోయింది. సైలెంట్ గా వచ్చి కార్తికేయ 2 తో బాక్సాఫీస్ హిట్ కొట్టిన నిఖిల్..కేవలం దక్షిణాదిన మాత్రమే కాదు ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా చేశారు..ఈ మూవీ ఒక్క దక్షిణాదిలోనే  రూ.100కోట్లు రాబట్టి నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 

ప్రస్తుతం నిఖిల్ నుంచి రాబోయే మూవీస్ కూడా సబ్జెక్టు ఓరియంటెడ్ మూవీస్ గా వస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ సమర్పణలో ది ఇండియా హౌస్ అనే టైటిల్ తో వస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కు రామ్ వంశీ కృష్ణ  డైరెక్షన్ చేయబోతున్నారు..

అలాగే నిఖిల్ మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో స్వయంభు అనే సినిమాను ప్రకటించారు. ఈ మూవీను కొత్త దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తోన్నారు. యుద్ధ వీరుడుగా కనిపించబోతున్నట్లు రిలీజ్ చేసిన నిఖిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేశారు నిఖిల్.