
వరంగల్ సిటీ, వెలుగు : వరంగల్ కార్పొరేషన్‌లో కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి రూ. 31 కోట్లు స్వాహా చేసిన కేసులో మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బల్దియాకు చెందిన అన్వేష్ అనే ఉద్యోగిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా అకౌంటెంట్ ఉమాకాంత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేసిన ఉమాకాంత్ అన్వేశ్‌కు సహకరించినట్లు వెల్లడించారు. ఈ కేసులో మరో ముగ్గురు ఉద్యోగుల హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.