కేజ్రీవాల్ ను సీఎంగా తొలగించాలని మరో పిల్

కేజ్రీవాల్ ను సీఎంగా తొలగించాలని మరో పిల్

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవిలో కొనసాగడాన్ని ఛాలెంజ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఆయనను సీఎంగా తొలగించాలంటూ హిందూసేన జాతీయాధ్యక్షుడు విష్ణు గుప్తా ఈ పిల్ వేశారు. త్వరలో దీనిపై విచారణ జరగనుంది. అయితే నిన్న ఈ తరహా పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించలేమంటూ తీర్పిచ్చింది. 

కాగా కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు.  మద్యం పాలసీ కేసులో మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది.  జైలు నుంచే కేజ్రీవాల్ పాలన కొనసాగిస్తున్నారు.  అయితే  ఇది రాజ్యాంగ విరుద్ధమని.. ప్రభుత్వ విశ్వసనీయత.. ప్రతిష్ట  దిగజారుతుందని హైకోర్టులో పిల్ దాఖలు చేసిన వారు వాదించారు. ఈ వాదనను ఢిల్లీ హైకోర్టు అంగీకరించలేదు.