రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు

రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు
  • రోహిత్ @ 9000

అహ్మదాబాద్: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును సాధించాడు. ఇండియా తరఫున టీ20ల్లో 9 వేల రన్స్ పూర్తి చేసిన సెకండ్ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందున్నాడు. ఫోర్త్ టీ20లో  రషీద్ బాలుకు సింగిల్ తీయడం ద్వారా ముంబైకర్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా షార్ట్  ఫార్మాట్లో ఈ ఘనత సాధించిన తొమ్మిదో క్రికెటర్ రోహిత్. తన 9 వేల రన్స్‌లో సగానికి కంటే ఎక్కువగా ఐపీఎల్ ద్వారానే రావడం విశేషం.  కెరీర్లో110 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడిన రోహిత్ 32.41 యావరేజ్తో 2800 రన్స్ చేశాడు. ఐపీఎల్, ఇంటర్నేషనల్స్ కలుపుకుని 342 మ్యాచ్ల్లో 9001 రన్స్ పూర్తి చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. జనవరిలో రోహిత్.. వన్డేల్లోనూ 9 వేల రన్స్ పూర్తి చేసిన థర్డ్ ఫాస్టెస్ట్ బ్యాట్స్మన్గా నిలిచాడు.