ఐకాన్ స్టార్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. పుష్ప సినిమాకు మరో సీక్వెల్

ఐకాన్ స్టార్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. పుష్ప సినిమాకు మరో సీక్వెల్

పుష్ప ది రైజ్‌‌‌‌‌‌‌‌(Pushpa the Rise) అంటూ  రెండేళ్ల  క్రితం ప్రేక్షకుల ముందుకొచ్చి రికార్డులు క్రియేట్ చేసిన అల్లు అర్జున్‌‌‌‌‌‌‌‌(Allu Arjun)..  ప్రస్తుతం ఈ మూవీ  సీక్వెల్‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కుతోన్న పుష్ప ది రూల్(Pushpa Rule)  పూర్తి చేసే పనిలో ఉన్నాడు.  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో వేసిన స్పెషల్ సెట్‌‌‌‌‌‌‌‌లో  దర్శకుడు  సుకుమార్(Sukumar) ఈ  చిత్రాన్ని శరవేగంగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్‌‌‌‌‌‌‌‌లో వచ్చే  గంగమ్మ జాతరకు సంబంధించి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ యాక్షన్ సీన్స్‌‌‌‌‌‌‌‌లో భాగంగా బన్నీ చేతికి గాయమైందని తెలుస్తోంది. అల్లు అర్జున్ ఎడమ చేతికి బ్యాండేజ్ ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ మూవీ షూటింగ్‌‌‌‌‌‌‌‌కి బ్రేక్ పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే అది చిన్న దెబ్బేనని, రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పినట్టుగా సమాచారం. మరోవైపు ఈ సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ ఒకటి ప్రచారంలో ఉంది. ఈ చిత్రానికి ‘పుష్ప ది రోర్’ అంటూ మూడో పార్ట్ కూడా ఉండబోతోందట. దీనిపై టీమ్‌‌‌‌‌‌‌‌నుంచి అఫీషియల్ అనౌన్స్‌‌‌‌‌‌‌‌మెంట్ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఫస్ట్ పార్ట్‌‌‌‌‌‌‌‌లో నటించిన నటీనటులే దాదాపు ‘పుష్ప2’లోనూ నటిస్తున్నారు. పుష్ప రాజ్ భార్యగా శ్రీవల్లి పాత్రలో రష్మిక కనిపించగా, సెకండ్ పార్ట్‌‌‌‌‌‌‌‌లో ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్ మరింత స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌గా ఉండబోతోంది.  జగదీష్, అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి  నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15న  రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.