విడాకులు తీసుకున్న నాగార్జున హీరోయిన్ ..

విడాకులు తీసుకున్న నాగార్జున హీరోయిన్ ..

బాలీవుడ్ బ్యూటీ ఇషా కొప్పికర్ (Isha Koppikar)..ఒకప్పటి ఇండియా మోడల్..హీరోయిన్..రాజకీయవేత్త. ఆమె హిందీ, తమిళ, తెలుగు, కన్నడ మరియు మరాఠీ మూవీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో బ్యూటీ ఇషా కొప్పికర్ నాగార్జున చంద్రలేఖ, వెంకటేష్ ప్రేమతో రా లాంటి చిత్రాల్లో మెరిసింది.

ఇదలా ఉంచితే..ఇషా 2009లో హోటల్ వ్యాపారి టిమ్మి నారంగ్‌ను వివాహం చేసుకుంది. వీరిద్దరికీ రియానా అనే కుమార్తె కూడా  ఉంది. అయితే, ఇషా..నారంగ్ 14 సంవత్సరాల వైవాహిక బంధం విడిపోయినట్లు సమాచారం. వీరిద్దరు విడిపోవడానికి కుటుంబ కలహాలే కారణం అని తెలుస్తోంది.

అయితే..ఇప్పటికే వీరి విడాకులు అప్లికేషన్ కూడా ఆమోదించబడింది. ఇదే విషయంపై ఇషా కొప్పికర్ రియాక్ట్ అవుతూ..నేను చెప్పడానికి ఏమి లేదు..చాలా తొందరగా జరిగిపోయింది..ఇక నా పర్సనల్ విషయాన్ని గోప్యతగా ఉంచాలని అనుకుంటున్నాను..మీరు కూడా గౌరవిస్తారని ఆశిస్తున్నా..అని ఇషా తెలిపింది. ప్రస్తుతం ఇషా..భర్త నుండి విడాకులు తీసుకుని..తన కుమార్తెతో విడిగా ఉంటుంది. 

ఇషా సినిమాల విషయానికి వస్తే..కృష్ణ కాటేజ్, డాన్ మరియు క్యా కూల్ హై హమ్ వంటి చిత్రాలలో గుర్తింపు పొందింది. ఈమె సినీ ఎంట్రీ W/o V. వర ప్రసాద్ తెలుగు సినిమా కావడం విశేషం. ఇషా రాజకీయాలల్లోను తనదైన పాత్ర పోషిస్తుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరి..బీజేపీ మహిళా రవాణా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆమె నియమితులయ్యారు.