ఆన్ లైన్ అప్పులతో మరో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

ఆన్ లైన్ అప్పులతో మరో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

శంషాబాద్, వెలుగు:  ఆన్ లైన్ యాప్ ల ద్వారా లోన్ తీసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఒకరు ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్, రాజేంద్రనగర్ పరిధిలోని కిస్మత్పూర్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి సునీల్ ఆన్ లైన్ లో 10 యాప్ ల ద్వారా లోన్ తీసుకున్నాడు. ఒక్కో యాప్ లో రూ. 5 వేల నుంచి రూ. 25 వేల వరకు అప్పు తీసుకున్నాడు. లోన్ లు తిరిగి కట్టడం లేట్ కావడంతో ఏజెంట్లు సునీల్ ఫొటోతో సహా
వివరాలను వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశారు. తీవ్రంగా ఒత్తిడి చేయడమే కాకుం డా.. అప్పులు కట్టడం లేదని వాట్సాప్ గ్రూపులో ఫొటో పెట్టి మరీ పరువు తీయడంతో అవమానాన్ని తట్టుకోలేకపోయిన సునీల్ బుధవారం ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయాడు. సునీల్ కు భార్య, కొడుకు ఉన్నారు. అతడి డెడ్ బాడీని పోలీసులు ఉస్మానియాకు తరలించారు. ఆన్లైన్ యాప్ ల ద్వారా లోన్లు తీసుకుని, ఇబ్బందులపాలు కావద్దని పోలీసులు సూచించారు.