సిద్ధార్థ్ రాయ్‌‌ మూవీ నుంచి మరో పాట రిలీజ్

సిద్ధార్థ్ రాయ్‌‌ మూవీ నుంచి మరో పాట రిలీజ్

దీపక్ సరోజ్, తన్వి నేగి జంటగా వి.యశస్వీ రూపొందించిన చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్‌‌’. జయ ఆడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మించారు.  ఫిబ్రవరి 23న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మంగళవారం మరో పాటను రిలీజ్ చేశారు.

‘నువ్వు నమ్మిన సిద్ధాంతం.. అయిపోయిందిక రాద్ధాంతం.. ఇకపై నీ పయనానికి కనబడుతుందా ఓ గమ్యం.. బతుకన్నది ఓ అందం నీకవ్వదుగా అది అర్ధం’ అంటూ సాగిన పాటలో దీపక్ అన్నీ కోల్పోయి రోడ్డుపై పడిన వాడిగా కనిపిస్తాడు. రథన్ కంపోజ్ చేసిన ఈ మెలోడీ సాంగ్‌‌కు బాలాజీ మీనింగ్‌‌ఫుల్ లిరిక్స్ రాయగా, శరత్ సంతోష్ పాడిన విధానం ఆకట్టుకుంది. తెలుగులో చాలామంది స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌‌గా నటించిన దీపక్ సరోజ్ హీరోగా  ఎంట్రీ ఇస్తున్న చిత్రమిది.